CSK vs RCB: చెన్నైలో 6155 రోజుల తరువాత RCB ఘన విజయం.. 5 d ago

featured-image

IPL 2025లో భాగంగా చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పై ఘన విజయం సాధించారు. 2008 తర్వాత చెన్నైలో CSKపై RCB ని గెలిపించిన ఘనత కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ కు దక్కింది. ఈ విజయంతో RCB ప్రస్తుత టేబుల్ టాపర్‌గా నిలిచారు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా కథ ముగించిన RCB.. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు IPL 2025లో విజయ విహారం చేస్తోంది.


టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై పట్టు బిగించలేక పోయారు. RCB ఓపెనర్ ఫిల్ సాల్ట్ (32) చెన్నై బౌలర్లను ఊచకోత కోశాడు. స్పిన్ పిచ్ మీద కూడా దూకుడుగా ఆడాడు. ఓపక్క కోహ్లీ తడపడుతున్న.. సాల్ట్ ఏమాత్రం ఆగలేదు. కానీ ఎంత బాగా ఆడుతున్న ఏమి లాభం.. ధోని కీపింగ్ ఉన్నప్పుడు, ముందుకు వెళ్లకూడద‌నే విషయాన్ని మర్చిపోయాడు పాపం. అలా కొంచెం ముందుకి కాలు కదపగానే వికెట్ల వెనుక ఉన్న ధోనీ మెరుపు వేగంతో స్టంపింగ్ చేశాడు. దీంతో తొలి వికెట్ గా సాల్ట్ పెవిలియన్ కి వెనుతిరిగాడు.


వన్-డౌన్ గా వచ్చిన పడిక్కల్ (27) కూడా ఉన్న కాసేపైనా మెరుపులు పుట్టించాడు. అశ్విన్.. పడిక్కల్ ను పెవిలియన్ కి పంపగా క్రీజులోకి దిగిన కెప్టెన్ పాటిదార్ తన బాట్ తో ఊరబాదుడు బాదాడు. 32 బంతుల్లో 4 ఫోరులు, 3 సిక్సలు కొట్టి 51 పరుగులు చేసాడు. ఒక ఎండ్ లో మెల్లగా నెట్టుకొస్తున్న కోహ్లీకి 11వ ఓవర్‌లో CSK స్పెషలిస్ట్ బౌలర్ పతిరణ..వేసిన బాల్ బలంగా తగిలింది. దీంతో కోపం వచ్చిన కోహ్లీ.. ఆ తరువాతి రెండు బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి గెట్టిగా అరిచాడు. తరువాత నూర్ అహమద్ వేసిన ఓవర్‌లో కోహ్లీ 31 పరుగులకే వెనుతిరిగాడు. లివింగ్‌స్టోన్ (10), జితేష్ శర్మ (12), క్రునల్ పాండ్య (0) కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయారు.


పాటిదార్ వికెట్ కూడా కోల్పోవడంతో.. మల్లి CSK పుంజుకుందనుకునే లోపే టిమ్ డేవిడ్ మెరుపులు పుట్టించాడు. చివరి ఓవర్‌లో సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి స్కోరును 200 పరుగులకు దగ్గరగా తీసుకెళ్లాడు. డేవిడ్ (22) సూపర్ హిట్టింగ్ తో RCB జట్టు 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.


భారీ లక్ష్యంతో బ‌రిలోకి దిగిన CSK ఓపెనర్లు చేతులెత్తేశారు. త్రిపాఠి (5) 2వ ఓవర్లోనే పెవిలియన్ కు చేరాడు. క్రీజులోకి వచ్చిన CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (0) సున్నాకే వెనుతిరిగాడు. హూడా (4), సామ్ కర్రాన్ (8) కూడా రాణించలేక పోయారు. ఓపెనర్ గా దిగిన రచిన్ రవీంద్ర (41) ఒక్క‌డే కాస్త మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన శివమ్ దూబే (19) కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించలేక పోయాడు.

అయితే గెలుపుకు 47 బంతులతో 117 పరుగులు కావాల్సిన కీలక సమయంలో ధోని బాటింగ్ కు రాకుండా.. మైదానంలోకి అశ్విన్ వచ్చాడు. ఇది అందరిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇక మ్యాచ్ చేజారిపోయిందన్న సమయంలో ధోని క్రీజ్ లోకి వచ్చాడు.. ఒక్కసారిగా స్టేడియం మొత్తం మోతమోగిపోయింది. కానీ ఏం లాభం.. ఇప్పటికే మ్యాచ్ అయిపోయింది.


ధోని ఆఖరి ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ తో మ్యాచ్ ఇన్నింగ్స్ ను ముగించాడు. 16 బంతులకే 30 పరుగులు చేసిన... మ్యాచ్ ఓడిపోయారు. ఈ బాటింగ్ ఏదో కొంచెం ముందే వచ్చి చేసుకుంటే బాగుండు కదా అని..అభిమానులు విమర్శిస్తున్నారు. 20 ఓవర్లలో CSK 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. 


IPL 2024 మ్యాచ్‌కి CSK రివేంజ్ తీర్చుకుంటుంది అనుకుంటే RCB బౌలర్ల దెబ్బకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఈ మ్యాచ్‌లో RCB బౌలర్లు అద్భుత ప్రదర్శన కనపరిచారు. CSK మ్యాచ్ కి రీ-ఎంట్రీ ఇచ్చిన స్వింగ్ కింగ్.. హేజిల్‌వుడ్ తో కలిసి CSK బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. RCB బౌలింగ్ యూనిట్ మొత్తం చాలా బాగా రాణించారు.

RCB ఈసారి ఒక్క బాటింగ్ లోనే కాదు.. బౌలింగ్ లో కూడా సత్తా చాటారు. దీంతో చెపాక్‌ స్టేడియం మొత్తం RCB..RCB..అనే చాంట్స్ తో మోతమోగిపోయింది.. అసలు ఇది నిజంగా చెన్నై స్టేడియం ఏనా.? అనే ప్రశ్న కలిగింది. వరుస విజయాలతో RCB పాయింట్ల టేబుల్‌ టాప్‌లో నిలిచింది.


టోర్నీలో భాగంగా ఈరోజు మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (GT) మరియు ముంబై ఇండియన్స్ (MI) మధ్య ఇంట్రెస్టింగ్‌ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 PM ISTకు ప్రారంభంకానుంది.


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD